![]() |
![]() |

బుల్లితెర మీద ప్రసారమయ్యే "కార్తీక దీపం" సీరియల్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందులో కార్తిక్, దీప, మోనిత ఈ ముగ్గురు బాగా ఫేమస్ ఐన క్యారెక్టర్స్.. కార్తీకదీపంలో మోనిత క్యారక్టర్ లో నటిస్తున్న శోభా శెట్టి ఈ మొత్తం సీరియల్ కి హైలైట్ అని చెప్పొచ్చు. మోనితగా శోభాశెట్టి కెరీర్ ని టర్న్ చేసిన సీరియల్ ఈ "కార్తీకదీపం". ఐతే ఆమె చేసే కుట్రలు కుతంత్రాల కారణంగా ఈమె జైలుకు వెళ్లడంతో ఆ క్యారెక్టర్ కి ఎండ్ కార్డు పడిపోయింది. తన వ్లాగ్‌లో కార్తీక దీపం షో నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని చెప్తూ బాధపడింది మోనిత.
డాక్టర్ బాబు - వంటలక్క ఉన్నప్పుడు మోనిత కూడా ఉంటే బాగుంటుంది అంటున్నారు ఈ సీరియల్ ఫాన్స్. చారుశీల పాత్ర ఏమంత బాలేదని, మోనితను వెనక్కి సీరియల్ లో ప్రవేశపెట్టాలని కోరుతున్నారు కార్తీకదీపం సీరియల్ అభిమానులు. మోనిత గురించి డాక్టర్ బాబుకి అన్ని విషయాలు తెలిసిపోయాయి కాబట్టి ఇక ఈ పాత్ర అవసరం లేదని తీసేశారంటూ మోనిత కొన్ని రోజుల క్రితం బాధపడింది. ఇప్పుడు మోనిత ఫ్రెండ్ చారుశీలను రంగంలోకి దించారు ..కానీ ఆడియన్స్ కి పెద్ద కిక్ ఇవ్వడం లేదు ఈ క్యారెక్టర్. అందుకే చారుశీల రోల్ తీసేసి మోనిత రోల్ ని తిరిగి తీసుకురావాలని కోరుతున్నారు.
ఈ సీరియల్ లో ఫేమస్ ఐన క్యారెక్టర్స్ లేవు అంటే చాలు ఆ సీరియల్ రేటింగ్ అమాంతం పడిపోతోంది. ప్రస్తుతానికి ఈ సీరియల్ సెకండ్ ప్లేస్ లోకి వచ్చేసింది. మరి టాప్ వన్ పొజిషన్ లోకి రావాలి అంటే మోనిత క్యారక్టర్ ని తిరిగి ప్రవేశ పెట్టక తప్పదని మేకర్స్ భావిస్తున్నారు. ఐతే మరి మోనిత ఎప్పుడు ఎలా తిరిగి వచ్చి డాక్టర్ బాబుకి, వంటలక్కకి ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే.
![]() |
![]() |